యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని పలు గ్రామాల్లో వర్షం భీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కురిసిన వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కుర్రారం, నర్సాపూర్ గ్రామంలో రాళ్లవర్షం కురిసింది. రాజపేట, నెమిల, దూది వెంకటాపురం, రఘునాథపురం, పాముకుంట, బొందుగులలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
రైతులను నిండాముంచిన అకాల వర్షం
ఒక వైపు కరోనాతో రైతులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో... అకాల వర్షం మరింత నష్టాన్ని మిగిల్చింది. రాజపేట మండలంలోని పలు గ్రామాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి బస్తాలు తడిసిపోయాయి. ధాన్యం రాసుల నుంచి వరి కొట్టుకుపోయింది.
రైతులను నిండాముంచిన అకాల వర్షం..
పలు చోట్ల పెద్ద చెట్లు నేలకొరిగాయి. మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి బస్తాలు తడిసిపోయాయి. ధాన్యం రాసుల నుంచి వరి కొట్టుకుపోయింది. మామిడి, నిమ్మ, బత్తాయి తోటల్లో పంట పూర్తిగా నేలరాలిపోయింది. చేతి కొచ్చిన పంట నేల రాలడం వల్ల రైతులు భారీగా నష్ట పోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.