యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగట్టపై భారీ వర్షం కురిసింది. దీంతో లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యాదాద్రి పరిసర ప్రాంతాలతో పాటు యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు కాలనీల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది.
rain in yadadri:యాదాద్రిలో భారీ వర్షం.. భక్తుల ఇబ్బందులు - యాదగిరిగట్టపై భారీ వర్షం
యాదాద్రి పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఆలయంలో ఒక్కసారిగా వాన కురవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లోనూ వర్షం కురిసింది.
యాదాద్రిలో భారీ వర్షం
వర్షపు నీరు కొండపై నుంచి దిగువకు ప్రవహించడంతో.. పైకి చేరుకునే ఘాట్ రోడ్డు వెంట మట్టి, ఇసుక రాళ్లు వచ్చి చేరాయి. యాదగిరిగుట్ట మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి.
ఇదీ చూడండి:Telangana Weather Report: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మూడురోజులు వర్షాలు