యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం శివారులోని సింగన్నగూడెం చౌరస్తా ,వరంగల్ -హైదరాబాద్ జాతీయ రహదారి 163 పై స్పీడ్ లిమిట్ డిజిటల్ బోర్డులను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ప్రారంభించారు. ప్రయాణంలో త్వరితగతిన చేరుకోవాలని చాలామంది ఆరాటపడు తుంటారని.. తమ గమ్యాన్ని చేరుకోవాలని వాయువేగంతో వాహనాలు నడుపడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా చాలా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
'వారికి స్పీడ్ లిమిట్ డిజిటల్ బోర్డులు ఉపయోగపడతాయి' - యాదాద్రి జిల్లా తాజా వార్తలు
గమ్య స్థానాలు చేరుకోవాలన్న ఉద్దేశ్యంతో వాహనాలు వేగంగా నడపడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. వాటిలో దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై స్పీడ్ లిమిట్ డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేశామన్నారు.
'వారికి స్పీడ్ లిమిట్ డిజిటల్ బోర్డులు ఉపయోగపడతాయి'
అతివేగమే ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో వాటిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై స్పీడ్ లిమిట్ డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేశామని సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. వాహన దారులందరికి ఈ స్పీడ్ లిమిట్ బోర్డులు ఉపయోగపడతాయన్నారు. ఎవరైనా స్పీడ్ లిమిట్ అతిక్రమించిన వారిపై జరిమానాలు విధించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి:పోరాడైనా కృష్ణా, గోదావరి జలాలను దక్కించుకుంటాం: కేసీఆర్