గ్రామంలోని కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామాన్ని సీపీతో పాటు జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, డీసీపీ నారాయణ రెడ్డి సందర్శించారు. రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ రాగా... హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నట్లు తెలిపారు.
'మీరు బయటికి రావొద్దు... కొత్తవారిని రానివ్వొద్దు'
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామాన్ని సీపీ మహేశ్ భగవత్, కలెక్టర్ అనితా రామచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డి సందర్శించారు. కరోనా విజృంభిస్తున్న వేళ కొత్తవారిని గ్రామంలోకి రానివ్వకుండా... అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని అధికారులు సూచించారు.
'మీరు బయటికి రావొద్దు... కొత్తవారిని రానివ్వొద్దు'
గ్రామస్తులు స్వీయ నియంత్రణ పాటించాలని... ఇతరులను గ్రామానికి రానీయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఎట్టి పరిస్థితిలో ఇళ్లలో నుంచి బయటికి రావొద్దని... అత్యవసర పనికోసం బయటికి వచ్చినప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని తెలిపారు. గ్రామంలో పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు తగు సూచనలు చేశారు.