యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును రాచకొండ అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు సందర్శించారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. లాక్డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి రాగాల ఫౌండేషన్ సహకారంతో గుడ్లు, భోజనాన్ని అందజేశారు.
Lockdown implementation: పోలీసులకు గుడ్లు, భోజనం అందజేసిన రాచకొండ ఏసీపీ - పోలీసులకు గుడ్లు, భోజనం అందజేసిన రాచకొండ ఏసీపీ సుదీర్ బాబు
యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న చెక్ పోస్ట్‌ను రాచకొండ అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి గుడ్లు, భోజనాన్ని అందజేశారు.

పోలీసులకు గుడ్లు, భోజనం అందజేసిన రాచకొండ ఏసీపీ
సుధీర్ బాబు వాహనదారులను తనిఖీ చేసి వారి వద్ద ఉన్ ఈ-పాసులను పరిశీలించారు. పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సుధీర్‌తో పాటు యాదాద్రి భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి, ట్రాఫిక్ సీఐ సతీశ్, భువనగిరి రూరల్ సీఐ జానయ్య, సీఐ శివ శంకర్, బీబీనగర్ ఎస్సై రాఘవేందర్ ఉన్నారు.
ఇదీ చదవండి :Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు