యాదాద్రి పట్టణంలో అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డు విస్తరణలో తొలగిస్తున్న ఇళ్లు, దుకాణాలు, స్థలాల కొలతలను ఆర్అండ్బీ అధికారులు చేపట్టారు. కొండ దిగువ ప్రాంతంలోని గాలిగోపురం వద్ద నుంచి మొదటి ఘాట్ రోడ్డు వరకు కొలతలు తీశారు.
యాదాద్రిలో రోడ్డు విస్తరణకు కొలతలు - యాదాద్రిలో ఆస్తుల స్టక్చర్ కొలతలు తీసిన అధికారులు
యాదాద్రి పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆర్అండ్బీ అధికారులు ఇళ్లకు స్టక్చర్ వాల్యుయేషన్ (కొలతలు) చేపట్టారు. రోడ్డు ప్రక్కన ఉన్న ఇళ్లు, స్థలాలు, దుకాణాలు కొలతలు చేపట్టి యజమానుల నుంచి వివరాలు సేకరించారు.
![యాదాద్రిలో రోడ్డు విస్తరణకు కొలతలు యాదాద్రిలో రోడ్డు విస్తరణకు కొలతలు తీసిన అధికారులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10481313-thumbnail-3x2-yadadri-rk.jpg)
యాదాద్రిలో రోడ్డు విస్తరణకు కొలతలు తీసిన అధికారులు
రోడ్డు మధ్య నుంచి ఇరువైపులా 55 ఫీట్ల మేర చేపట్టే విస్తరణ పనులకు అధికారులు సర్వే చేశారు. కార్యక్రమంలో ఈఈ శంకరయ్య, ఇతర సిబ్బంది ఉన్నారు.
ఇదీ చూడండి:హ్యాట్సాఫ్: రహదారికి 'పోలీసు' మరమ్మతులు