తెలంగాణ

telangana

ETV Bharat / state

చౌటుప్పల్​లో 9 మందికి క్వారంటైన్ ముద్ర

సూర్యాపేట జిల్లా నూతన్​కల్​ నుంచి యాదాద్రి జిల్లా చౌటుప్పల్​కు వచ్చిన ఓ కుటుంబంలోని 9 మందికి వైద్యులు క్వారంటైన్ ముద్ర వేశారు. లాక్​డౌన్​ ముగిసే వరకు బయటకు రావొద్దని హెచ్చరించారు.

quarantine stamp for nine members in family at choutuppal
చౌటుప్పల్​లో 9 మందికి క్వారంటైన్ ముద్ర

By

Published : Apr 17, 2020, 2:37 PM IST

సూర్యాపేట జిల్లా నూతనకల్​కు చెందిన బొబ్బా వీరారెడ్డి కుటుంబసభ్యులు 9మందికి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో క్వారంటైన్ ముద్ర వేశారు. వీరు గత నెలలో లాక్​డౌన్​ ప్రకటించగానే స్వగ్రామం నూతనకల్​కు వెళ్లారు. ఇటీవల సూర్యాపేట జిల్లాను ఆరెంజ్​ జోన్​గా ప్రకటించగా... అక్కడ అంత సురక్షితం కాదని తిరిగి చౌటుప్పల్​కు వచ్చారు.

చౌటుప్పల్​లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న... వీరిని గమనించి స్థానికులు డాక్టర్​లకు సమాచారం ఇచ్చారు. వైద్యుల బృందం వచ్చి... వారిని మందలించి, బయటికి రావద్దొని సూచించారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎవరూ వెళ్లొద్దని డాక్టర్​ శివప్రసాద్​ అన్నారు. కరోనా లక్షణాలు అందరిలో కనిపించవు కానీ ఇతరులకు తొందరగా వ్యాప్తి చెందుతుందన్నారు. లాక్​డౌన్​ ముగిసే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలన్నారు.

ఇదీ చూడండి:కరోనా హాట్​స్పాట్​కు వెళ్లారని ఇంట్లోకి నో ఎంట్రీ!

ABOUT THE AUTHOR

...view details