తెలంగాణ

telangana

ETV Bharat / state

'పేదల బతుకుల్లో వెలుగు నింపిన మహోన్నతుడు చే..' - yayadri bhuvanagiri news

చేగువేరా 53 వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని పీవైఎల్​ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. దోపిడీ, పీడన, అన్యాయాలకు గురవుతున్న ప్రజల స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని కోరుకున్న గొప్ప విప్లవకారుడు చేగువేరా అని నాయకులు కొనియాడారు.

pyl leaders tribute to che guvera in aleru
pyl leaders tribute to che guvera in aleru

By

Published : Oct 10, 2020, 9:03 AM IST

ప్రపంచ పీడిత ప్రజల విముక్తి కోసం... ముఖ్యంగా క్యూబా సాయుధ విప్లవంలో కామ్రేడ్ చే గువేరా మేటి అని ప్రగతి శీల యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.కుమార్​ కొనియాడారు. చేగువేరా 53 వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని పీవైఎల్​ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

దోపిడీ, పీడన, అన్యాయాలకు గురవుతున్న ప్రజల స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని కోరుకున్న గొప్ప విప్లవకారుడు చేగువేరా అని నాయకులు తెలిపారు. సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన దేశ భక్తి అనే నినాదంతో చేగువేరా, భగత్ సింగ్ లాంటి ఎందరో వీరులు నడిచిన బాటలో నడవాలని కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్​ జిల్లా అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్, పాకాల నరేశ్​, ఎం.సిద్దులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: త్వరలోనే రైతులకు డబ్బులు.. యాసంగి సాగుపై నేడు సమీక్ష

ABOUT THE AUTHOR

...view details