ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని.. శ్రీ లక్ష్మీ సమేత నారసింహునికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. బాలాలయ మండపంలో ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. వివిధ రకాల పుష్పాలతో అర్చన జరిపారు.
యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన మహోత్సవం - లక్ష పుష్పార్చన
యాదాద్రిలో శ్రీ లక్ష్మీ సమేత నారసింహునికి లక్ష పుష్పార్చన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు.. వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సుదర్శన నారసింహ హోమాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన మహోత్సవం
ఆలయ అర్చకులు.. వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సుదర్శన నారసింహ హోమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు.. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చదవండి:రాగి పాత్రల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలివే!