తమపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని భాజపా నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ కార్యకర్తల అక్రమ అరెస్టులు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
కమలదళం ఆందోళనతో ట్రాఫిక్‌కి అంతరాయం కలిగింది. అలాగే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ కార్యకర్త శ్రీనివాస్ కోలుకోవాలని వలిగొండలో రేణుక ఎల్లమ్మ గుడిలో పూజలు నిర్వహించి.. గుడి ఆవరణలో మౌనదీక్ష చేపట్టారు.