భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు వద్ద జాతీయ రహదారిపై అన్ని పార్టీల నాయకులు బైఠాయించారు. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నిరసన తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోరుతూ.. రాస్తారోకో చేపట్టారు. జాతీయ రహదారి దిగ్బంధంతో ఇరు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
ఆలేరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన - mla gongidi sunitha updates on barath bundh
ఆలేరు ప్రకాష్ గార్డెన్ వద్ద జాతీయ రహదారిపై కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీత నిరసన తెలిపారు. యావత్ భారతదేశ రైతులు తలపెట్టిన భారత్ బంద్‌లో భాగంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో పార్టీల నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించారు.
ఆలేరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన
నిరసన చేపట్టిన ఆందోళనకారులను, పలు పార్టీల నాయకులను, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ పునరుద్ధరణను చేపట్టారు. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు మద్దతుగా అధికార, ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో వ్యాపార సంస్థలు, దుకాణాలు మూసివేశారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట