తెలంగాణ

telangana

ETV Bharat / state

'గ్రామం మొత్తానికి ఒకేసారి పరిహారం చెల్లించాలి' - యాదాద్రి భువనగిరిలో బీఎన్ తిమ్మాపురం వాసులు ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు బీఎన్ తిమ్మాపురం వాసులు ధర్నా నిర్వహించారు. బస్వాపురం రిజర్వాయర్​ వల్ల ముంపునకు గురవుతున్న తమ గ్రామం మొత్తానికి ఒకేసారి పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. ముంపునకు గురికాని భూములకూ పరిహారం చెల్లించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

protest at Yadadri bhuvanagiri mro office by  BN Thimmapuram residents
'గ్రామం మొత్తానికి ఒకేసారి నష్టపరిహారం చెల్లించాలి'

By

Published : Feb 27, 2021, 4:38 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు బీఎన్ తిమ్మాపురం వాసులు ఆందోళనకు దిగారు. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల తమ గ్రామంలో భూములు కోల్పోతున్న రైతులందరికీ ఒకేసారి పరిహారం చెల్లించాలని ధర్నా నిర్వహించారు. జిల్లా అధికారులు, రెవిన్యూ సిబ్బంది కొంతమంది రైతుల దగ్గర లంచాలు తీసుకుని.. భూములు కోల్పోని వారికీ పరిహారం మంజూరు చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

'1.5 టీఎంసీలకు సంబంధించి గ్రామంలోని వివిధ సర్వే నంబర్లకు చెందిన 150 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. అందుకు ప్రొసీడింగ్ తయారు చేశారు. కానీ ఆ ప్రొసీడింగ్​లో లేని ఇతర సర్వే నంబర్లలో ఉన్న వారికి పరిహారం ఎలా చెల్లిస్తారు'అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. అందరికీ ఒకేసారి పరిహారం చెల్లించకుంటే సోమవారం కలెక్టరేట్​ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: బిట్టు శ్రీను కస్టడీ కోసం మంథని కోర్టులో పోలీసుల పిటిషన్

ABOUT THE AUTHOR

...view details