తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో రక్షణ గోడ నిర్మాణం వేగవంతం - యాదాద్రి ఆలయం తాజా వార్తలు

యాదాద్రి పుణ్యక్షేత్రాభివృద్ధిలో భాగంగా కొండపై రక్షణ గోడ నిర్మాణాన్ని అధికారులు వేగవంతం చేశారు. ఉత్తరదిశలో నిర్మితమయ్యే రక్షణ గోడకు దిగువన ఉన్న కొండపై చదునుచేసి ఇతర కట్టడాలను చేపట్టనున్నారు. ఆర్అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో రక్షణ గోడ పనులు జరుగుతున్నాయి.

యాదాద్రిలో రక్షణ గోడ నిర్మాణం వేగవంతం
యాదాద్రిలో రక్షణ గోడ నిర్మాణం వేగవంతం

By

Published : Jun 26, 2020, 11:52 AM IST

యాదాద్రి పంచ నారసింహుల పుణ్యక్షేత్ర అభివృద్ధిలో భాగంగా కొండపై ఉత్తర దిశలో రక్షణ గోడ నిర్మాణాన్ని అధికారులు వేగవంతం చేశారు. ఉత్తరం వైపు దిగువ భాగాన ఆలయ కొత్త కనుమ దారి పక్కన నిర్మించిన గోడకు గురువారం సిమెంటు ఫిల్లింగ్ పనులను భారీ యంత్రాల సహాయం ద్వారా చేపట్టారు.

ఉత్తరదిశలో నిర్మితమయ్యే రక్షణ గోడకు దిగువన ఉన్న కొండపై చదునుచేసి ఇతర కట్టడాలను చేపట్టనున్నారు. ఆర్అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో రక్షణ గోడ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా బాలాలయం దిగువ భాగాన భక్తుల కోసం కొత్తగా నిర్మిస్తున్న క్యూలైన్ల వద్ద కూడా జేసీబీ సాయంతో త్వరగా చదును పనులు చేస్తున్నారు.

ఇవీచూడండి:ప్రతిఇంటికీ ఆరు మొక్కలు... వాటికి కుటుంబ సభ్యుల పేర్లు: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details