తెలంగాణ

telangana

ETV Bharat / state

'పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆ లక్ష్యం నేటికీ నెరవేరలేదు'

తెరాస పాలనలో సంక్షేమ ఫలాలు పేదవారికి అందని ద్రాక్షగానే మిగిలాయని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో నిరుద్యోగుతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

professor kodandaram interact with employees  in yadadri bhuvanagiri district
'పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆ లక్ష్యం నేటికీ నెరవేరలేదు'

By

Published : Feb 14, 2021, 9:20 PM IST

పాలకుల దౌర్జన్యాలను ఎదురించే ప్రజల గొంతుక బలపడాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో నిరుద్యోగుతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఏ ఆశయ సాధన కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో.. నేటికీ ఆ కల సాకారం కాలేదని ప్రొఫెసర్​ కోదండరాం అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ఊసే లేదన్న ఆయన... తెరాస పాలనలో ప్రభుత్వ ఫలాలు పేదవారికి అందని ద్రాక్షగానే మిగిలాయని ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోయిన కవితను రెండేళ్లలో ఎమ్మెల్సీగా గెలిపించుకున్న సీఎం కేసీఆర్...​ మరి తెలంగాణ బిడ్డల గురించి ఎందుకు పట్టించుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు. ఈ దుర్మార్గమైన పాలనను కొనసాగించడమా? లేదా ? అనేది ఓటర్లు నిర్ణయించుకోవాలని కోరారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామిక ఆకాంక్షలకు ప్రభుత్వ అహంకార, నిరంకుష పాలనకు మధ్య సాగుతున్న ఘర్షణగా కోదండరాం పేర్కొన్నారు.

ఇదీ చదవండి:అసమ్మతి: మంత్రి కార్యక్రమాన్ని బహిష్కరించిన కౌన్సిలర్లు

ABOUT THE AUTHOR

...view details