Priyanka Gandhi Bhuvanagiri Election Campaign : పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందో.. రాబోయే ఐదేళ్లు ఎలాంటి పాలన కావాలో ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాక గాంధీ (Priyanka Gandhi ) అన్నారు. భువనగరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె.. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఇది ఎన్నికల సమయమని.. ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై అవగాహన లేదని.. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలన్న ఆలోచనలేదని విరుచుకుపడ్డారు. దేశంలో నోట్ల రద్దు, కరోనా, జీఎస్టీ వల్ల ప్రజలు అనేక సార్లు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు.
6 గ్యారెంటీలు తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాం : ప్రియాంక గాంధీ
'కష్టాల సమయంలో ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోలేదు. ఉద్యోగాలు కావాలన్న యువత కలలను ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు. మహిళలపై రోజూ అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రజల చిన్నచిన్న సమస్యలను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదు. రైతులను కూడా ఈ ప్రభుత్వం ఆదుకోలేదు.. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి'- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత
సామాన్యులతో ప్రియాంకా గాంధీ సందడి - హుస్నాబాద్‌లో ఆ కుటుంబానికి సర్ప్రైజ్
Priyanka Gandhi Election campaign in Telangana : రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు ఎలాంటి సహాయం చేయలేదని ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడిన యువతకు రాష్ట్రంలో ఎలాంటి న్యాయం జరగలేదని ప్రియాంక గాంధీ విమర్శించారు. ఎంతో కష్టపడి పరీక్షలు రాస్తే.. పేపర్లు లీక్ చేసి యువత జీవితాలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భవిష్యత్ బాగుంటుందని యువత పోరాడితే వారి జీవితం అంధకారమైందని పేర్కొన్నారు.