తెలంగాణ

telangana

ETV Bharat / state

PM modi about vittalacharya in mann ki baat : తెలంగాణ వ్యక్తి గురించి మన్​కీబాత్‌లో ప్రధాని ప్రస్తావన - విఠలాచార్యా గ్రంథాలయం

PM modi about vittalacharya in mann ki baat : మన్​కీ బాత్‌లో భాగంగా.... పుస్తకాల గొప్పతనం గురించి ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఈ క్రమంలో యాదాద్రి జిల్లాకు చెందిన విఠలాచార్య గురించి ప్రస్తావించారు. గ్రంథాలయ ఏర్పాటు కోసం ఆయన చేసిన కృషిని అభినందించారు.

PM modi about vittalacharya in mann ki baat, VITTALACHARYA LIBRARY
మనకీబాత్‌లో తెలంగాణ వ్యక్తి గురించి ప్రధాని ప్రస్తావన

By

Published : Dec 26, 2021, 1:57 PM IST

Updated : Dec 26, 2021, 7:10 PM IST

PM modi about vittalacharya in mann ki baat : పుస్తకపఠనం కేవలం జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకే కాకుండా మన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతాయని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. మన్​కీ బాత్‌లో భాగంగా.... పుస్తకాల గొప్పతనం గురించి వివరించే క్రమంలో ప్రధాని.... తెలంగాణకు చెందిన విఠలాచార్య గురించి ప్రస్తావించారు. యాదాద్రి జిల్లా రామన్నపేటలో విఠలాచార్య ఏర్పాటు చేసిన గ్రంథాలయం, అందు కోసం ఆయన చేసిన కృషిని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. 2021 ఏడాదిలో చివరి, 84వ మనసులో మాట(మన్​ కీ బాత్​) కార్యక్రమంలో మాట్లాడారు.

మన్​కీ బాత్​లో ప్రధాని వ్యాఖ్యలు

మన్​కీ బాత్​లో విఠలాచార్య కృషిని ప్రధాని అభినందించారు. మన దేశం ఎందరో ప్రతిభావంతులను ప్రపంచానికి అందజేసిందని... వారి సృజనాత్మకత మిగతా వారందరికీ స్ఫూర్తినిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. కలలను నెరవేర్చుకోవడానికి వయసుతో పట్టింపు లేదనడానికి.... తెలంగాణకు చెందిన డాక్టర్‌ కూరెళ్ల విఠాలాచార్య ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని విఠలాచార్యకు చిన్నతనం నుంచి కోరిక ఉండేదని.... కానీ, అప్పట్లో దేశం బ్రిటీషు వారి చేతుల్లో ఉన్న కారణంగా ఆయన కల నెరవేరలేదని ప్రధాని వెల్లడించారు. ఆ తర్వాత అధ్యాపకుడైన విఠలాచార్య.... తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసి ఎన్నో రచనలు చేశారని వివరించారు.

'ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని విఠలాచార్యకు చిన్నతనం నుంచి కోరిక ఉండేది. అప్పట్లో దేశం బ్రిటీషు వారి చేతుల్లో ఉన్న కారణంగా ఆయన కల నెరవేరలేదు. ఆరేడేళ్ల క్రితం ఆయన తన కలను నెరవేర్చుకోవటంపై దృష్టి సారించారు. తాను సేకరించిన అనేక పుస్తకాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆయన జీవితకాలం దాచుకున్న డబ్బునంతా ఖర్చుచేశారు. క్రమంగా ప్రజలంతా ఆయనతో చేతులు కలిపి... గ్రంథాలయ విస్తరణలో భాగస్వాములయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ఉన్న ఈ గ్రంథాలయంలో ప్రస్తుతం 2లక్షల వరకు పుస్తకాలు ఉన్నాయి. చదువుకునేందుకు తాను పడిన కష్టాలు మరెవరూ పడొద్దని విఠలాచార్య ఆకాంక్షించారు. ఇవాళ ఎంతో మంది ఈ గ్రంథాలయానికి వస్తుండటం పట్ల ఆయన ఎంతో సంతోషిస్తున్నారు. విఠలాచార్య స్ఫూర్తితో ఇతర గ్రామాల్లోనూ గ్రంథాలయాలను నెలకొల్పుతున్నారు. పుస్తకాలు కేవలం జ్ఞానాన్ని ఇవ్వటమే కాదు... మన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతాయి.'

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

తెలంగాణ వ్యక్తి గురించి మన్​కీబాత్‌లో ప్రధాని ప్రస్తావన
ఇదీ చదవండి: komuravelli mallanna kalyanam 2021 : కమనీయం.. కోరమీసాల మల్లన్న కల్యాణం..
Last Updated : Dec 26, 2021, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details