ఇటీవల కొవిడ్ సోకడంతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నిత్య కైంకర్యాలకు దూరంగా ఉన్న ఆలయ పూజారులకు గురువారం నెగిటివ్ వచ్చింది. దీంతో వారు తిరిగి విధుల్లోకి చేరి పూజలు కొనసాగించారని ఆలయ ఏఈవో గజ్వేల్ రమేశ్‌బాబు తెలిపారు.
యాదాద్రిలో విధుల్లో చేరిన పూజారులు, వేదపండితులు - యాదాద్రి పూజారులు
కొవిడ్ సోకడంతో నిత్య కైంకర్యాలకు దూరంగా ఉన్న పూజారులు, ఐదుగురు వేదపండితులకు నెగిటివ్ రావడంతో వారు తిరిగి విధుల్లోకి చేరారు. వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం వీరు కరోనా బారిన పడ్డారు. భక్తులను కొవిడ్ నిబంధనల మేరకు అనుమతిస్తున్నట్లు అధికారులు వివరించారు.
యాదాద్రిలో విధుల్లో చేరిన పూజారులు, వేదపండితులు
యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాక దాదాపు పది మంది పూజారులు, ఐదుగురు వేద పండితులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వీరంతా ఇంటి వద్ద చికిత్స పొందారు. తాజాగా జరిపిన నిర్ధరణ పరీక్షల్లో నెగిటివ్ రావడంతో పూజారులు, వేద పండితులు తిరిగి కొవిడ్ నిబంధనల నడుమ నిత్య కైంకర్యాల్లో పాల్గొనాలని ఆదేశాలిచ్చినట్లు ఏఈవో చెప్పారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ దర్శనాలకు అనుతిస్తున్నట్లు వివరించారు.