ఈ నెల 8 నుంచి లాక్‌డౌన్ సడలింపుల దృష్ట్యా... యాదాద్రి ఆలయంలో భక్తుల అనుమతికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా పరిస్థితుల్లో ఆలయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భక్తుల ప్రవేశం, ప్రభుత్వ మార్గదర్శకాల అమలుపై అధికారులు సమీక్ష జరిపారు. ముందుగా ట్రయల్ పూర్తి చేశాకే... ఒకేసారి ఎంత మందిని అనుమతించాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.
యాదాద్రీశుని దర్శనానికి తొలుత ట్రయల్‌రన్ - యాదాద్రీశుని దర్శనానికి ఏర్పాట్లు
ఆలయాలు ఈనెల 8నుంచి పున:ప్రారంభం కానున్న సందర్భంగా యాదాద్రిలో భక్తుల అనుమతికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ... శానిటైజర్లు, మాస్కులు ధరించే స్వామివారి దర్శనం చేసుకునేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.
యాదాద్రీశుని దర్శనానికి ట్రయల్‌రన్
శానిటైజర్లు, దూరం, మాస్కుల విషయంలో పకడ్బంధీగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొండపైకి వాహనాలను యథావిధిగా అనుమతించనున్నట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: నిద్రిస్తున్న వ్యక్తిపై దుండగుల దాడి.. నగదు, బంగారం చోరీ