తెలంగాణ

telangana

ETV Bharat / state

108 వాహనంలోనే ప్రసవం.. తల్లీబిడ్డా క్షేమం - అంబులెన్సులో గర్భిణీ ప్రసవం వార్తలు యాదాద్రి జిల్లా

యాదాద్రి జిల్లా నార్కట్​పల్లి మండలం చెరువుగట్టు వద్ద ఓ గర్భిణీ.. 108 వాహనంలో ప్రసవించింది. మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించే క్రమంలో పురిటినొప్పులు ఎక్కువకావడం వల్ల వాహన సిబ్బంది సహాయంతో ఆశ వర్కర్​ ఎల్లమ్మ ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని.. తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు.

108 వాహనంలోనే ప్రసవం.. తల్లిబిడ్డా క్షేమం
108 వాహనంలోనే ప్రసవం.. తల్లిబిడ్డా క్షేమం

By

Published : Nov 19, 2020, 8:01 PM IST

యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన 9 నెలల గర్భిణీ అయిన అలకుంట్ల భారతి ప్రసవం కోసం మోత్కురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చేరుకుంది. గర్భంలో శిశువు బరువు ఎక్కవగా ఉందని వైద్యులు తెలిపారు. 108 వాహనంలో నల్గొండలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించాలని వైద్యులు సూచించారు.

మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించే క్రమంలో నార్కట్​పల్లి మండలం చెరువుగట్టు వద్దకు రాగానే పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. 108 వాహన సిబ్బంది సహాయంతో ఆశ వర్కర్ ఎల్లమ్మ​ వాహనంలోనే ప్రసవం చేశారు. తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నారని వాహన సిబ్బంది తెలిపారు. భారతి.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఫోన్​ టార్చ్​ వెలుతురులో ప్రసవం

ABOUT THE AUTHOR

...view details