తెలంగాణ

telangana

ETV Bharat / state

పరువు హత్యకు గురైన రామకృష్ణ మృతదేహానికి పోస్ట్​మార్టం పూర్తి

పరువు హత్యకు గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి రామకృష్ణ మృతదేహానికి గజ్వేల్​ ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్​మార్టం పూర్తయింది. మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు వైద్యులు అప్పగించారు. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలని రామకృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ప్రజాసంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి.

ramakrishna
రామకృష్ణ

By

Published : Apr 18, 2022, 4:51 PM IST

Updated : Apr 18, 2022, 5:15 PM IST

యాదాద్రి భుననగిరి జిల్లాలో పరువు హత్యకు గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి రామకృష్ణ మృతదేహానికి గజ్వేల్​ ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయింది. మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు వైద్యులు అప్పగించారు. మృతదేహాంతో గజ్వేల్ నుంచి ఆయన స్వస్థలం లింగరాజుపల్లికి కుటుంబ సభ్యులు బయలుదేరారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య కేసు నేపధ్యంలో శవ పరీక్ష కోసం వైద్యులు సుదీర్ఘ సమయం తీసుకున్నారు.

మరోవైపు రామకృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భువనగిరిలోని వినాయక్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. మృతుడు రామకృష్ణ భార్యతో పాటు బంధువులు పాల్గొన్నారు. భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం, పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రేమిస్తే చంపేస్తేరా అంటూ మృతుడి బంధువులు ప్రశ్నించారు. రామకృష్ణను ఎలా చంపారో వెంకటేష్​ని అలాగే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. భార్గవి జీవితాన్ని తలచుకొని బంధువులు ఆవేదన చెందారు.

మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రజా సంఘాల ధర్నా

రామకృష్ణ హత్యలో పాల్గొన్న నలుగురు నిందితులకు భువనగిరి కేంద్ర ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రికి తీసుకొచ్చిన వారిలో లతీఫ్‌, దివ్య, అఫ్సర్‌, మహేశ్‌లు ఉన్నారు. పోలీసుల రక్షణ మధ్య వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీస్​స్టేషన్​కి తీసుకెళ్లి.. అక్కడి నుంచి నిందితులను భువనగిరి కోర్టులో హాజరుపరిచారు.

నిందితులకు వైద్య పరీక్షలు

అసలేం జరిగిదంటే

భువనగిరి పట్టణంలో పరువు హత్య కలకలం సృష్టించింది. పట్టణంలో శుక్రవారం అదృశ్యమైన ఎరుకుల రామకృష్ణ (32) అనే యువకుడు విగతజీవిగా మారారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం శివారు పెద్దమ్మతల్లి దేవాలయం సమీపాన నిర్మాణంలో ఉన్న రైల్వే లైను పునాదిలో అతడి మృతదేహం లభ్యమైంది. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడనే కక్షతో రామకృష్ణను అతడి మామ వెంకటేష్‌ సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుని భార్య భార్గవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమృతయ్య అనే వ్యక్తిని విచారించగా కుట్ర మొత్తం బయటికొచ్చింది.


ఇదీ చదవండి: పరువు హత్య కలకలం.. రూ.10 లక్షల సుపారీతో అల్లుడిని చంపించిన మామ

భక్తులపై ఎస్పీ నేత దాడి.. యువకులను దారుణంగా కొట్టి..

Last Updated : Apr 18, 2022, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details