యాదాద్రి భువనగిరిజిల్లాలోని వివిధ మండలాల్లో ఉండే 45 నిరుపేద చేనేత కార్మిక కుటుంబాలకు పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్(పోపా) వారు ఇంటింటికి వెళ్లి 25 కిలోల బియ్యం, నిత్యావసర సామగ్రిని అందజేశారు.
పోపా దాతృత్వం.. నిరుపేద పద్మశాలి కుటుంబాలకు ఆసరా
కరోనా నేపథ్యంలో చేనేత కార్మికుల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడానికి విరాళాలు ఇవ్వాలని 'పోపా' ఇచ్చిన పిలుపునిచ్చింది. ఈ మేరకు యాదాద్రి భువనగిరిజిల్లా మోత్కూరు మండల పద్మశాలీలు ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
పోపా దాతృత్వం.. నిరుపేద పద్మశాలి కుటుంబాలకు ఆసరా
ఈ కార్యక్రమానికి మోత్కూరు మున్సిపాలిటీ ఛైర్పర్సన్ శ్రీమతి తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి పాల్గొని మోత్కూరులోని 'పోపా' సభ్యులను అభినందించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉత్తర్వులను గౌరవించి లాక్డౌన్ను విజయవంతం చేయాలని.. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని ఆమె సూచించారు. సామాజిక దూరం పాటించాలన్నారు.
ఇదీ చూడండి:'కాబోయే అమ్మ'పై కరోనా వైరస్ ప్రభావం