యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు. మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో పేకాటలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేయగా... పేకాటరాయుళ్లు పరారయ్యారు.
పేకాట స్థావరాలపై పోలీసుల దాడి - మోత్కూరులో పోలీసుల దాడులు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేపట్టారు. పోలీసులు రాకతో అప్రమత్తమైన పేకాటరాయుళ్లు అక్కడి నుంచి పరారయ్యారు.
![పేకాట స్థావరాలపై పోలీసుల దాడి పేకాట స్థావరాలపై పోలీసుల దాడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8757020-1001-8757020-1599758612139.jpg)
పేకాట స్థావరాలపై పోలీసుల దాడి
ఘటన స్థలంలో ఆటకు ఉపయోగించిన కార్డులు, రూ. 3,460 నగదు, మూడు చరవాణులు, ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడ్డా శిక్షార్హులే అని ఎస్ఐ హెచ్చరించారు.