తెలంగాణ

telangana

ETV Bharat / state

అనాథలకు ఆర్థిక సాయమందించిన పోలీసులు - yadadhri bhuvanagiri district latest News

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో చిన్నారి అనాథలను ఎస్ఐ ఉదయ్ కిరణ్ తన సిబ్బందితో కలిసి పరామర్శించారు. అనంతరం ఐదు వేల రూపాయలను సాయంగా అందించారు.

అనాథలకు ఆర్థిక సాయమందించిన పోలీసులు
అనాథలకు ఆర్థిక సాయమందించిన పోలీసులు

By

Published : Sep 5, 2020, 7:37 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో చిన్న వయసులోనే తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన బాధితుల సహాయార్థం దాతలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎస్ఐ ఉదయ్ కిరణ్ తన సిబ్బందితో కలిసి చిన్నారులను పరామర్శించారు.

అనాథ అనే భావన రానీయకూడదు...

అనంతరం తమ వంతు సాయంగా ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించి పిల్లలకు ధైర్యం కల్పించారు. తాము అనాథ అనే భావనను మనసులో నుంచి తుడిచివేయాలని ఎస్సై ఉదయ్ కిరణ్ సూచించారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

ముమ్ముందు తోచిన సాయం...

భవిష్యత్​లో ఏ అవసరం ఉన్నా తనకు చేతనైన సహాయం చేయగలమని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎస్ఐ కట్ట మోహన్ , అంకిరెడ్డి యాదయ్య, కానిస్టేబుల్ అల్లందాసు జగన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చూడండి : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా 20న చలో దిల్లీ

ABOUT THE AUTHOR

...view details