తెలంగాణ

telangana

ETV Bharat / state

నేను కరోనా ! మీరు జాగ్రత్తగా లేకుంటే మీలోకి ప్రవేశిస్తా - YADAGIRIGUTTA.

లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జాగృతి పోలీస్ కళా బృందం అవగాహన కల్పిస్తోంది.

కరోనాపై అవగాహన కల్పిస్తున్న జాగృతి పోలీస్ కళా బృందం
కరోనాపై అవగాహన కల్పిస్తున్న జాగృతి పోలీస్ కళా బృందం

By

Published : Apr 24, 2020, 3:37 PM IST

లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి జాగృతి కళా బృందం అవగాహన కల్పిస్తోంది. కరోనా వైరస్ నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించడానికి వినూత్న వేషధారణలో సుమారు 10 మంది గల బృందం ఇంటింటికీ తిరుగుతోంది. కరోనాపై ఆట పాటలతో, నాటికలతో డప్పు, చప్పుళ్లతో యాదగిరిగుట్ట పట్టణంలో 10 మంది సభ్యులతో అవగాహన కల్పిస్తున్నారు. నేను కరోనా ... మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మీ శరీరంలోకి ప్రవేశిస్తా అంటూ అవగాహన కల్పించారు. రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కళా బృందం పేర్కొంది. ప్రతి రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని గ్రామాల్లో తిరుగుతూ కరోనాపై ప్రజలను చైతన్యులను చేస్తున్నారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎస్సై, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details