తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో కరోనా కట్టడి చర్యలు - TG_NLG_61_26_corona_jagratha_Vo_TS10101

యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా వ్యాప్తి నిరోధ ప్రక్రియలో భాగంగా పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. నిత్యావసర వస్తువుల కోసం వచ్చే వినియోగదారులు చేతులు కడుక్కున్న తరువాత వస్తువులు కొనుగోలు చేసేలా నీళ్లు, సబ్బు అందుబాటులో ఉంచారు. లాక్ డౌన్ సమయంలో బయటకి వచ్చే ప్రజలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

POLICE INITIATES CORONA CONTROLLING ACTIVITIES
యాదాద్రిలో కరోనా కట్టడి చర్యలు.

By

Published : Mar 26, 2020, 7:56 PM IST

కరోనా కట్టడికి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలో పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల కోసం వస్తున్న వ్యక్తుల నుంచి వ్యాపారస్తులకు కరోనా సోకకుండా దుకాణం ముందు బకెట్​లో నీరు, సబ్బు ఉంచి చేతులు శుభ్రంగా కడిగి వస్తువులు కొనుగోలు చేయాలని పోలీసులు నిబంధన విధించారు. కిరాణ దుకాణాల ముందు సామాజిక దూరం పాటించేలా ముగ్గులు వేశారు.

కొందరు ప్రజాప్రతినిధులు నిరుపేదలకు ఉచితంగా మాస్కులు అందించారు. భారత్ గ్యాస్ ఏజన్సీవారు గ్యాస్ సిలిండర్​ను తీసుకెళ్ళేవారికి ఉచితంగా మాస్కులు, గ్లౌవ్స్ అందించి వారి ఉదారతను చాటుకుంటున్నారు. పట్టణ వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎవరైనా బయటకి వస్తే పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మాస్కులు లేనివారు విధిగా ధరించాలని సూచిస్తున్నారు.

యాదాద్రిలో కరోనా కట్టడి చర్యలు.


ఇవీచూడండి:'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details