తెలంగాణ

telangana

By

Published : Jul 31, 2021, 5:06 PM IST

ETV Bharat / state

POLICE HUMANITY: దీనస్థితిలో వృద్దుడు... ఆస్పత్రికి తరలించిన పోలీసులు

ఓ వృద్ధుడు లేవలేని దీనస్థితిలో పాఠశాలలో పడుకున్నాడు అంటూ... పోలీస్​స్టేషన్​కు ఓ స్కూలు నుంచి ఫోన్ వెళ్లింది. అక్కడికి వెళ్లిన పోలీసులు అతనిని చూసి జాలిపడ్డారు. అతనిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సరే కదా అని వివరాలు తెలుసుకుంటుంటే.. అప్పుడు నిజాలు బయటపడ్డాయి. వృద్ధునికి భార్య, పిల్లలు, ఆస్తి ఉండి కూడా... ఇలా దిక్కులేని స్థితిలో ఉన్నాడని తెలిసి ఆశ్చర్యపోయారు. అయినా వాళ్లే అతనిని చూడట్లేదు అని తెలిసి కౌన్సిలింగ్ ఇచ్చారు.

POLICE HUMANITY
దీనస్థితిలో వృద్దుడు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రాథమిక పాఠశాలలో ఓ వృద్ధుడు చావు బతుకుల మధ్య అల్లాడిపోతున్నాడు. కనీసం లేవలేని స్థితిలో అస్థిపంజరం వంటి శరీరంతో... వారం రోజులుగా అదే పాఠశాలలో ఓ మూలన పడుకున్నాడు. వృద్ధుడికి భార్య, పిల్లలు, ఆస్తి ఉండి కూడా అతనిని నిర్థాక్షణ్యంగా ఇంటి నుంచి గెంటేశారు. దీనస్థితిలో ఆదుకోవాల్సిన వారే రోడ్డు మీద పడేయడంతో... వృద్ధుడు పాఠశాలలోనే తలదాచుకుంటున్నాడు. అతనిని గమనించిన పాఠశాల యాజమాన్యం.. వృద్ధుడి కుటుంబసభ్యులకు ఫోన్​ చేసి తీసుకువెళ్లాల్సిందిగా సూచించారు. వారు నిరాకరించడంతో ఉదయం పోలీసులకు ఫోన్​ చేసి సమాచారం అందించారు.

పాఠశాలకు వచ్చిన పోలీసులు అతనిని ఆటోలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం వివరాలు సేకరించారు. వృద్ధుడి కుటుంబసభ్యులతో ఎస్సై మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయిన వాళ్లే ఇంటి నుంచి నెట్టేస్తున్న సమయంలో వృద్ధుడికి అండగా నిలబడి... పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు.

ఇదీ చూడండి:NEED HELP: ఆమె కష్టానికి సమాధానం చిరునవ్వేనా? వృద్ధురాలి దీనగాథ తెలిసేనా?

ABOUT THE AUTHOR

...view details