యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామంలో డీసీపీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలనుస్వాధీనం చేసుకున్నారు. ఒక రౌడీ షీటర్ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
'నేరాల నియంత్రణకు నిర్బంధ తనిఖీలు' - పోలీసుల నిర్బంధ తనిఖీలు
నేరాల నియంత్రణకు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ భుజంగారావు తెలిపారు. భువనగిరి మండలంలోని నందనం గ్రామాల్లో సోదాలు నిర్వహించినట్లు వెల్లడించారు.
'నేరాల నియంత్రణకై నిర్బంధ తనిఖీలు'
నేరాల నియంత్రణకు, నేరస్థుల గుర్తించేందుకే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ భుజంగారావు పేర్కొన్నారు. అజ్ఞాత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే సమాచారం తెలిపాలని సూచించారు. ఈ సోదాల్లో ఇద్దరు ఏసీపీలు, ముగ్గురు ఎస్సైలు, ముగ్గురు సీఐలు, 10 మంది ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 82 మంది పోలీసులు పాల్గొన్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి:ప్రయాణికుల ఇక్కట్లు... 2 కిమీ ముందే ఆర్టీసీ నిలిపివేత !