తెలంగాణ

telangana

ETV Bharat / state

ttd type ticket sales in yadadri: తిరుమల తరహా యాదాద్రిలో టికెట్ల విక్రయాలు..! - నల్గొండ తాజా వార్తలు

ttd type ticket sales in yadadri:యాదాద్రి క్షేత్రంలో దైవ దర్శనాలకు వచ్చే భక్తులకు తిరుమల తరహాలో టికెట్ల విక్రయాలు అమలు చేయాలనే యోచనలో ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ప్రయోగాత్మకంగా ఈ విధానాలను పరిశీలించనున్నారు. మరోవైపు స్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 4న మెుదలు కానుండడంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్‌ బర్కత్‌పురలోని యాదగిరిభవన్‌ నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అఖండజ్యోతి ప్రచార రథయాత్రను అధికారులు ప్రారంభించారు.

Plan for  at yadadri  temple on lines in Tirumala
యాదాద్రిలో తిరుమల తరహాలో దర్శనాలు

By

Published : Mar 2, 2022, 12:46 PM IST

ttd type ticket sales in yadadri: పునర్నిర్మితమైన యాదాద్రి క్షేత్రంలో దైవ దర్శనాలను తిరుమల తరహాలో కల్పించే యోచనలో ఆలయ యంత్రాంగం కసరత్తులు చేపడుతోంది. ఆలయ ఉద్ఘాటన జరిగాక భక్తుల రాక గణనీయంగా పెరగనుందని అధికారులు భావిస్తున్నారు.

తిరుమల తరహాలో దర్శనాలు

ఈ క్రమంలో బ్రేక్, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం పేరిట అమలు చేయగలమా.. చేస్తే ఎలా ఉంటుందనే దానిపై అధికారులు దృష్టి సారించారు. స్కానింగ్, క్యూఆర్ కోడ్​తో పాటు ఆన్​లైన్​లో టికెట్ల విక్రయాలు లాంటి విధానాలను ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు.

యాదాద్రికి అఖండజ్యోతి యాత్ర

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు మార్చి 4న మొదలు కానుండడంతో దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బాలాలయంలో చివరిసారిగా జరగనున్న వార్షికోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఆలయ మండపంలో యాగశాల సిద్ధమవుతోంది.

ఉత్సవాల్లో చేపట్టే అలంకార సంబరాల కోసం వెండి సేవామూర్తులు, వాహనాలకు మెరుగులు దిద్దే పనులకు శ్రీకారం చుట్టారు. మంగళవారం హైదరాబాద్‌ బర్కత్‌పురలోని యాదగిరిభవన్‌ నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అఖండజ్యోతి ప్రచార రథయాత్ర బయల్దేరింది. యాత్ర బ్రహ్మోత్సవాల అంకురార్పణ సమయానికి(శుక్రవారం) యాదాద్రికి చేరుకోనుంది. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో ఎన్. గీత, యాడా వైస్ ఛైర్మన్ జి.కిషన్ రావు తదితరులు ప్రారంభించారు.

ఇదీ చదవండి: శివపార్వతుల కల్యాణ ఘట్టాన్ని తిలకించే... భక్తులు జన్మ ధన్యమైందంటూ పరవశించే...

ABOUT THE AUTHOR

...view details