రాష్ట్రవ్యాప్తంగా వ్యాయామ విద్య ప్రవేశ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన కేంద్రాన్ని చౌటుప్పల్ తంగేడుపల్లిలో ఎంఎంఆర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 16 కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్షల పోటీలను నిర్వహిస్తుండగా... 7,800 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఎంఎంఆర్ కళాశాలలో వ్యాయామ విద్య ప్రవేశ పరీక్షలు ప్రారంభం - pecet-2020
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని ఎంఎంఆర్ వ్యాయామ కళాశాలలో వ్యాయామ విద్య ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 557 మంది అభ్యర్థులకు... లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, రన్నింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు.
ఎంఎంఆర్ కళాశాలలో వ్యాయామ విద్య ప్రవేశ పరీక్షలు ప్రారంభం
యాదాద్రి భువనగగిరి జిల్లాలో 557 మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, రన్నింగ్ పోటీలు నిర్వహించి సమర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ ఆధారంగా ర్యాంక్లు కేటాయించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చూడండి:ధరణి పోర్టల్ ద్వారా క్రమంగా పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు