రహదారి విస్తరణ వెడల్పును కుదించాలని తుంగతుర్తి ఎమ్మెల్యేను మోత్కూరు మున్సిపాలిటీలోని వ్యాపారులు కలిశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీలోని ప్రధాన రహదారిని 100 ఫీట్ల నుంచి 80 ఫీట్లకు కుదించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. రోడ్డు వెడల్పు చేయడం వల్ల చాలా మంది వ్యాపారులు నష్టపోతున్నారని.. కొందరు వ్యాపారులు తమ దుకాణాలను పూర్తిగా కోల్పోతున్నారని ఎమ్మెల్యేకు విన్నవించారు.
రహదారి విస్తరణ వెడల్పును కుదించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం - yadadri bhuvanagiri district news
మోత్కూరు మున్సిపాలిటీలోని ప్రధాన రహదారిని 100 ఫీట్ల నుంచి 80 ఫీట్లకు కుదించాలని వ్యాపారులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. రోడ్డు వెడల్పు చేయడం వల్ల వ్యాపారులు నష్టపోతున్నారని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు.
![రహదారి విస్తరణ వెడల్పును కుదించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం Petition to the MLA to reduce the width of the road widening at mothkur in yadadri bhuvanagiri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8065356-1080-8065356-1594993341010.jpg)
రహదారి విస్తరణ వెడల్పును కుదించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం
వ్యాపారుల వినతిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 80 ఫీట్లకు అందరికి సమ్మతమైతే ఇబ్బంది ఏమీ లేదన్నారు.
ఇవీ చూడండి: బురదలో ఇరుక్కుపోయిన వాహనం.. బాలింతకు నరకం