యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని పల్లెర్ల గ్రామంలో కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తికి.. గ్రామ పంచాయతీ సిబ్బంది అంత్యక్రియలు జరిపి దాతృత్వాన్ని చాటుకున్నారు.
45ఏళ్ల గుర్రం యాదగిరి 5 రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. కరోనా లక్షణాలు కనిపించటం వల్ల ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. తన స్వగ్రామంలో హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటూ.. ఈరోజు ఉదయం మరణించాడని సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి తెలిపారు.