యాదాద్రి భువనగిరి జిల్లాలో జూన్ 3న తొలి కరోనా మరణం సంభవించింది. అయినా.. ప్రజలు మాత్రం జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. యాదగిరి గుట్టలోని ఫించన్ పంపిణీ కేంద్రం వద్ద మాస్కులు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా ఫించన్దారులు గుమిగూడారు.
కరోనా కబళించినా.. జాగ్రత్తలు పాటిస్తలేరు! - యాదగిరి గుట్ట
యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలి కరోనా మరణం సంభవించినా.. ప్రజలు మాత్రం కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. యాదగిరి గుట్టలోని ఫించన్ పంపిణీ కేంద్రం వద్ద కనీస జాగ్రత్తలు పాటించకుండా ఫించన్ కోసం గుమిగూడారు.
కరోనా కబళించినా.. జాగ్రత్తలు పాటిస్తలేరు!
సంబంధిత అధికారులు పలుమార్లు సామాజిక దూరం పాటించాలని చెప్పినా.. మాస్కులు ధరించాలని సూచించినా.. వారి ప్రవర్తలో మాత్రం మార్పు రాలేదు. సామాజిక దూరం పాటించి.. కనీస జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీచూడండి :40 మంది విద్యార్థులపై కత్తితో దాడి