ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి నారసింహుని సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతి రోజు ఉదయం, రాత్రి వేళల్లో స్వామి, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలకరించి వాహన సేవ నిర్వహిస్తున్నారు.
యాదాద్రిలో సింహవాహనంపై కనువిందు చేసిన నారసింహుడు - యాదాద్రి జిల్లా వార్తలు
యాదాద్రి లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహనంపై స్వామివారు ఊరేగారు. స్వయంభువులకు ఉత్సవ ఆరాధనలు జరిపారు.
యాదాద్రిలో సింహవాహనంపై కనువిందు చేసిన నారసింహుడు
ఆరో రోజు ఉత్సవాల్లో భాగంగా.. సింహవాహనంపై ఉగ్రనరసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. వేదపండితులు సింహవాహన సేవ విశిష్టతను భక్తులకు వివరించారు.
ఇవీచూడండి:ఈ వేసవి కాలం నిప్పు రేగితే నీరేది?