తెలంగాణ

telangana

ETV Bharat / state

భౌతికదూరం పాటించకుండా క్యూ లైన్‌లో ప్రజలు - రాజపేటలో యూరియా పంపిణీ

కరోనా తీవ్రత అధికమవుతోన్న కొందరిలో మార్పు రావట్లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తోటి వారు భయాందోళనకు గురయ్యేలా చేస్తున్నారు. యాదాద్రి జిల్లా రాజాపేటలో యూరియా కోసం వచ్చిన రైతులు భౌతికదూరం పాటించలేదు. మాస్కులు కూడా ధరించకుండా రావడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

భౌతికదూరం పాటించకుండా క్యూ లైన్‌లో ప్రజలు
భౌతికదూరం పాటించకుండా క్యూ లైన్‌లో ప్రజలు

By

Published : Aug 27, 2020, 10:43 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో ఒక వైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాజాపేటలోని వ్యాపార వర్గాలు మధ్యాహ్నం వరకే దుకాణాలు తెరిచి ఉంచే విధానం కొనసాగుతోంది.

ఈ క్రమంలో పీఏసీఎస్‌కు 440 యూరియా సంచులు రాగా.. పంపిణీ ప్రక్రియను రాజపేట గోదాం ఆవరణలో అధికారులు ఏర్పాటు చేశారు. వీటిని తీసుకువెళ్లే ప్రక్రియలో భాగంగా రైతులు భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా క్యూ లైన్‌లో ఉండడం కనిపించింది కలవరానికి గురి చేస్తోంది. ఇందులో కొందరు మాస్కులు ధరించకపోవడం గమనార్హం.

ఇదీ చూడండి :వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details