కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు.. దాతలు తమకు తోచినంత సహాయం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఏరియా ఆస్పత్రికి.. రోటరీ క్లబ్ అమీర్ పేట ఆధ్వర్యంలో మాస్కులు, రెండు ఫ్రీజర్లు అందజేశారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు పాటించాలి: ఎమ్మెల్యే సునీత - ఆలేరు ఏరియా ఆస్పత్రికి.. రోటరీ క్లబ్ అమీర్ పేట ఆధ్వర్యంలో మాస్కులు, రెండు ఫ్రీజర్లు అందజేత
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఏరియా ఆస్పత్రికి.. అమీర్ పేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మాస్కులు, రెండు ఫ్రీజర్లు అందజేశారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
![కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు పాటించాలి: ఎమ్మెల్యే సునీత Central and State Governments should follow regulations: MLA Sunita](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7371888-896-7371888-1590590192666.jpg)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు పాటించాలి: ఎమ్మెల్యే సునీత
విపత్కర పరిస్థితుల్లో రోగులకు అండగా నిలిచిన క్లబ్ సభ్యులను ఈ సందర్భంగా సునీతా సన్మానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నియమాలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచించారు.