తెలంగాణ

telangana

ETV Bharat / state

'రామన్నపేటలో అన్నపూర్ణ క్యాంటిన్ ఏర్పాటు చేయాలి' - తెలంగాణ వార్తలు

లాక్​డౌన్ వేళ హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్లు ఎంతోమంది ఆకలి తీర్చాయని తెలంగాణ ఇంటి పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కె చాంద్, ఫిట్ ఇండియా ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు తలారి గణేష్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోనూ ఏర్పాటు చేయాలని కోరారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

annapurna canteen, fit India
అన్నపూర్ణ క్యాంటీన్, ఫిట్ ఇండియా

By

Published : Jun 5, 2021, 4:09 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో అన్నపూర్ణ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని తహసీల్దార్ ఆంజనేయులుకు తెలంగాణ ఇంటి పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కె చాంద్, ఫిట్ ఇండియా ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు తలారి గణేష్ వినతి పత్రం అందజేశారు. మండలానికి పలు ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది వస్తారని తెలిపారు. వారి ఆకలి తీర్చేలా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని కోరారు.

హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వం క్యాంటీన్లు ఏర్పాటు చేసి లాక్​డౌన్ సమయంలో లక్షలాది మంది అన్నార్తుల ఆకలి తీర్చిందని తలారి గణేష్, ఎస్.కె చాంద్ పేర్కొన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:Tammineni: 'ఈటల.. భాజపా పంచన చేరటం సిగ్గుచేటు'

ABOUT THE AUTHOR

...view details