ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గత రెండు దశాబ్దాల్లో నమోదు కాని రీతిలో వాగుల్లో వరద పోటెత్తుతోంది. ఉపరితల ఆవర్తనం, షేర్ జోన్ ప్రభావంతో ఆదివారం నుంచి మంగళవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ సమాచారాన్ని బట్టి ఉద్ధృతి మరింత పెరిగే సూచనలున్నాయి. వంతెన(కాజ్ వే)ల పై నుంచి నీరు పారుతున్న సమయంలో ప్రజలు రాకపోకలు కొనసాగిస్తూనే ఉన్నారు. దీనివల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వంతెన మీదుగా పారే నీరు మామూలు వరదలా కనిపిస్తున్నా లోపల నీటి ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. దానిపై నుంచి నడిచి వెళ్లే సమయంలో ఆ ఒత్తిడి తట్టుకోలేక కొట్టుకుపోతున్నారు.
వరుస ప్రమాదాలు..
- వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో చెరువులు అలుగు పోస్తుండగా, వాగులు భీకరంగా ప్రవహిస్తున్నాయి. యాదాద్రి జిల్లా గత నెల 29న చండూరు మండలం శిర్దేపల్లికి వచ్చి తిరిగివెళ్తుండగా ఇద్దరు యువకులు అక్కడి వాగులో కొట్టుకుపోయారు. పిల్లరు, కంపచెట్టు పట్టుకుని వేలాడుతుండగా అక్కడున్న మూడో వ్యక్తి గ్రామస్థులను తీసుకురావడంతో బాధితులను రక్షించగలిగారు.
- రాజపేట మండలం కుర్రారం గ్రామ శివారులోని దోసలవాగు వద్ద నీటి ప్రవాహానికి గత నెల 30న ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. ఘటన జరిగిన రోజు సాయంత్రం ఒకరిని గుర్తించగా, నాలుగు రోజుల గాలింపు తర్వాత మరో యువతి మృతదేహం లభ్యమైంది.
- ఈ నెల 3న నాంపల్లి మండలం నర్సింహులగూడెం నుంచి చండూరు మండలం చామలపల్లికి వెళ్తుండగా.. జింకలవంపు వాగు వద్ద మోటార్ సైకిల్ అదుపుతప్పి ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న నర్సింహులగూడెం వాసులు తాళ్ల సాయంతో బాధితులను రక్షించి ఒడ్డుకు చేర్చారు. వాహనం మాత్రం కనిపించకుండా పోయింది. ఆ సమయంలో స్థానికులు లేకుంటే మాత్రం ఆ ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి