యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో నిర్వాహకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. పట్టణంలో ఏర్పాటు చేసే వినాయక విగ్రహాల వివరాలు తెలిపి అనుమతులు తీసుకోవాలని సూచించారు. తమ వివరాలను ఆన్లైన్లో పొందుపర్చుకోవాలన్నారు. గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు సుమారు నలుగురు కాపలాగా ఉండాలన్నారు. నిమజ్జనం వివరాలు ముందుగా పోలీసులకు తెలపాలని... తమ వంతు రక్షణ కల్పించనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీసుల సమావేశం - peace- committee -meeting
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా... ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

peace- committee -meeting
ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీసుల సమావేశం
TAGGED:
peace- committee -meeting