యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్దకొండూర్లోని వలస కార్మికులకు కృష్ణా జిల్లా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూరగాయలను పంపిణీ చేశారు. పెద్దకొండూర్లోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న 150 కుటుంబాలకు వారు టమాటలు, ఆలుగడ్డలు, సొరకాయ వంటి కూరగాయలను అందజేశారు.
వలస కార్మికులకు పవన్ ఫ్యాన్స్ చేయూత - Yadadri Bhuvanagiri Migrant Workers Distribution
లాక్డౌన్ వల్ల ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు దాతలు చేయూతనిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్దకొండూర్లోని వలస కార్మికులకు కృష్ణా జిల్లా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూరగాయలను అందజేశారు.
![వలస కార్మికులకు పవన్ ఫ్యాన్స్ చేయూత కూరగాయల పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7140771-736-7140771-1589110622078.jpg)
కూరగాయల పంపిణీ
పవన్ కల్యాణ్ ఆశయాల మేరకు... ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పేదలకు సహాయం చేస్తున్నామని వారు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని కరోనాను తరిమి కొట్టాలని వారు కోరారు. ప్రభుత్వ సూచనలను పాటించాలని... ముఖానికి మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:అమ్మా.. నీ మనసు వెన్న...