తెలంగాణ

telangana

ETV Bharat / state

సాహిత్యం, చిత్రలేఖనం విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు - పాటిమట్ల పాలపిట్ట -2 కవితా సంకళనం

సాహిత్యం, చిత్రలేఖనం వంటి కళలు విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేస్తాయని రాష్ట్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్​ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా పాటిమట్ల ఉన్నత పాఠశాలలో పాటిమట్ల పాలపిట్ట-2 కవితా సంకళనాన్ని ప్రారంభించారు.

సాహిత్యం, చిత్రలేఖనం విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు
సాహిత్యం, చిత్రలేఖనం విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు

By

Published : Jan 29, 2020, 9:53 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు విద్యతో పాటు సాహిత్యం, చిత్రలేఖనం పట్ల ప్రతిభను కనబరుస్తున్నారు. గతేడాది రూపోందించిన పాటిమట్ల పాలపిట్ట కవితా సంకలనం సాహివేత్తల ప్రశంసలు అందుకుంది. అదే స్ఫూర్తితో ఈ ఏడాది పాటిమట్ల పాలపిట్ట -2 కవితా సంకళనాన్ని పాఠశాల ఆవరణలో ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి, బండి సాయన్న చేతుల మీదుగా ఆవిష్కరించారు.

పాఠశాలల్లో నేర్చుకున్న విద్య, సాహిత్యం, చిత్రలేఖనం వంటి కళలు విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేస్తాయని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి అన్నారు. కవితలు రాయడంతో పాటు వ్యాసరచన, ప్రసంగంలోనూ చక్కని ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు ఎంచుకున్న లక్షాన్ని సాధించడం కోసం ఇష్టంగా చదువుకుని ఉన్నతికి ఎదగాలని బండి సాయన్న ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీగేయ రచయిత అభినయ శ్రీనివాస్, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పోరేటి రంగయ్య పాల్గొన్నారు.

సాహిత్యం, చిత్రలేఖనం విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు

ఇవీ చూడండి:'రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్​లో గళమెత్తండి'

ABOUT THE AUTHOR

...view details