తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవంగా లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం - patha gutta Lakshmi Narasimha marriage celebrations

బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు లక్ష్మీనరసింహుడి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం తరపున స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, కలెక్టర్ అనితా రామచంద్రన్​లు పట్టు వస్త్రాలు సమర్పించారు.

patha gutta Lakshmi Narasimha marriage celebrations today
వైభవంగా లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం

By

Published : Feb 8, 2020, 9:33 AM IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధ ఆలయం శ్రీపాతగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహుడి కల్యాణం వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరపున స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, కలెక్టర్ అనితా రామచంద్రన్​లు పట్టు వస్త్రాలు సమర్పించారు.

వైభవంగా లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం

స్వామి, అమ్మవార్లను గజవాహనంపై మేళ తాలలతో ఆలయ తీరు వీధుల్లో ఊరేగించి కల్యాణ మూర్తిని మండపానికి చేర్చారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారి మెడలో స్వామివారు మాంగళ్య ధారణ చేశారు. లోకరక్షకుడి కల్యాణం చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ఇదీ చూడండి :కన్నుల పండువగా అమ్మవార్ల దర్శనం.. భక్తుల తిరుగు పయనం

ABOUT THE AUTHOR

...view details