రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల మూడున స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు పదిన అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నాయి.
పాతగుట్టలో ఐదో రోజు ఘనంగా బ్రహ్మోత్సవాలు - patagattu venkateshwara swam,y brahmotsavalu
యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నాలుగో రోజు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగాయి. హనుమంత వాహన సేవపై నయనానందకరంగా అలంకరించారు. అనంతరం ఆలయ పురవీధుల్లో ఊరేగించారు.
పాతగుట్టలో ఐదో రోజు ఘనంగా బ్రహ్మోత్సవాలు
ఐదో రోజైన నేడు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని గరుడ వాహన సేవపై నయనానందకరంగా అలంకరించారు. వేదమంత్రాలు మంగళ వాద్యాల నడుమ ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చూడండి:ఎఫ్‌డీఐలను పరిశీలించేందుకు ఓ కమిటీ!