నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెరాసలో చేరితే అది అతనికి ఆత్మహత్యతో సమానమేనని టీపీసీసీ ప్రచార కార్యదర్శి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. లింగయ్యను తమ కుటుంబ సభ్యుడుగా భావించి గెలిపించామన్నారు. పదవి లేని సమయంలోనూ కాపాడుకున్నామని... దళితునికి అన్యాయం జరగొద్దని అధిష్ఠానంతో కొట్లాడి టికెట్ ఇప్పించామని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు.
పార్టీ మారటం ఆత్మహత్యతో సమానం - EQUAL
రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరిగా కారెక్కుతున్నారు. ఇప్పటికే రేగా కాంతరావు, ఆత్రం సక్కు గులాబీ కండువా కప్పుకుంటామని ప్రకటించగా... తాజాగా చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యే తెరాసలో చేరతారనే వార్తలొస్తున్నాయి. ఈ సమాచారంతో హస్తం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
హస్తం నేతల ఆగ్రహం...!