పురపాలిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) విస్తృత ఏర్పాట్లు చేస్తుండటంతో, రాజకీయ పార్టీలు తమ వ్యూహాల్లో వేగం పెంచుతున్నాయి. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాజయం పాలైన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పురపాలిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పోరాడుతున్నాయి. తమకు బలమున్న మిర్యాలగూడ, ఆలేరు, చండూరు, హుజూర్‌నగర్, దేవరకొండ ప్రాంతాల్లో తెరాస, కాంగ్రెస్‌లకు గట్టిపోటీనివ్వాలని ప్రయత్నిస్తున్నాయి. మరికొన్ని పురపాలికల్లో బలమున్న అభ్యర్థులను నిలిపి సత్తా చాటాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నట్లు తెలిస్తోంది.
పురపోరుకు సీపీఎం, సీపీఐ సన్నద్ధం - trs
అసెంబ్లీ, పార్లమెంటుతోపాటు పంచాయతీ, స్థానికసంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన సీపీఎం, సీపీఐలు ఉనికి కోసం పోరాడుతున్నాయి. తమకు బలమున్న ప్రాంతాల్లో తెరాస, కాంగ్రెస్‌లకు గట్టి పోటీనిచ్చి, 'పురపోరు'లో నిలవాలని దృఢనిశ్చయంతో ఉన్నాయి.
పురపోరుకు సీపీఎం, సీపీఐ సన్నద్ధం...