రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల దృష్ట్యా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో నేటి నుంచి ఈ నెల 23 వరకు పాక్షిక లాక్డౌన్ విధించారు. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకే దుకాణాలు తెరచి ఉంటాయని.. వ్యాపారులు, వినియోగదారులు సహకరించాలని కిరాణం అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు సత్యనారాయణ తెలిపారు. అందరూ మాస్కులు ధరిస్తూ.. కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.