కరోనా వ్యాప్తిని నివారించేందుకు లాక్‌డౌన్‌ను విధించి.. వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు, అధికారులు ఎంత చెబుతున్నా.. కొందరు మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజాలో పనిచేసే సిబ్బంది ఒకే వాహనంలో పదుల సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా వాహనాల్లో తిరుగుతున్నారు. ద్విచక్ర వాహనంపై ఒకరు, కారులో ఇద్దరు అని నిబంధన ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదు.
నిబంధనలను పాటించని పంతంగి టోల్‌ప్లాజా సిబ్బంది - Pantagi toll plaza staff do not follow lockdown rules
పంతంగి టోల్‌ప్లాజాలో పనిచేసే సిబ్బంది ఒకే వాహనంలో పదుల సంఖ్యలో ప్రయాణిస్తూ లాక్డౌన్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.
నిబంధనలను పాటించని పంతంగి టోల్‌ప్లాజా సిబ్బంది