యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : పల్లా రాజేశ్వర్ రెడ్డి - ఎమ్మెల్సీ ఎన్నికలు
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందించిన ఘనత కేవలం కేసీఆర్‌కే దక్కుతుందని శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనియాడారు. అతి త్వరలోనే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
![పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : పల్లా రాజేశ్వర్ రెడ్డి Palla Rajeshwar Reddy Participated In Cadre Meeting in Chowtuppal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8884701-750-8884701-1600695150154.jpg)
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : పల్లా రాజేశ్వర్ రెడ్డి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చౌటుప్పల్‌లో కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్రంలో పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందరికీ అందజేస్తున్నామని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి :సరూర్‌నగర్ నాలాలో గల్లంతైన నవీన్ మృతి