యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు పోలీస్‌స్టేషన్ ముందు పద్మశాలీలు బుధవారం ఉదయం ధర్నాకు దిగారు. మంగళవారం పద్మశాలి కులస్థులను కించపరుస్తూ ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరంగా పోస్టులు పెట్టాడు. దీనిపై కులసంఘాల పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆలేరు పోలీస్‌స్టేషన్ ముందు పద్మశాలీల ధర్నా - Padmashali Caste peoples Strike before the Alleru police station
ఆలేరు పోలీస్‌స్టేషన్ ముందు పద్మశాలీలు ధర్నాకు దిగారు. సామాజిక మాధ్యమాల్లో కులస్థులను అభ్యంతరకరంగా కించపరుస్తూ ఓ వ్యక్తి చేసిన పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆలేరు పోలీస్‌స్టేషన్ ముందు పద్మశాలీల ధర్నా
పోస్టు చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్‌స్టేషన్ ముందు ధర్నా చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. దాదాపు రెండు గంటలపాటు రహదారిని దిగ్బంధించటం వల్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వటం వల్ల నిరసన విరమించారు.