యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రజాప్రతినిధులు తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి, వీరారెడ్డిపల్లి, గంధమల్ల గ్రామాల్లో పీఏసీఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. కర్షకులు కష్టపడకూడదనే.. తెలంగాణ సర్కార్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని అన్నారు.
'రైతులు ఇబ్బంది పడకూడదనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు' - yadadri bhuvanagiri district news
రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు అన్నారు. తుర్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పీఏసీఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు, భువనగిరిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. తెరాస సర్కార్ అన్నదాతలకు అండగా నిలుస్తోందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని వెల్లడించారు. కర్షకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో.. ఎంపీపీ భూక్య సుశీల రవిందర్ నాయక్, పీఎసీఎస్ ఛైర్మన్ సింగిరెడ్డి నర్సింహారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.