గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తితిదే బోర్డు సభ్యులు శివకుమార్ హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర చేపట్టారు. శుక్రవారం గో మహా పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చేరుకుంది. బీబీనగర్ మండల శివారులో యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి ఘనస్వాగతం పలికారు.
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలంటూ పాదయాత్ర - padayatra to declare cow as national festival
తితిదే బోర్డు సభ్యులు శివకుమార్ హైదరాబాద్ నుంచి చేపట్టిన పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాకు చేరుకుంది. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపట్టినట్లు శివకుమార్ వెల్లడించారు.
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలంటూ పాదయాత్ర
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు తాము వివిధ రూపాల్లో పోరాటం చేస్తామని బాలకృష్ణారెడ్డి వివరించారు. పాదయాత్రకు బీబీనగర్ పీఏసీఎస్ ఛైర్మన్, రాష్ట్ర హిందూవాహిని నాయకులు, హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తదితరులు సంఘీభావం ప్రకటించారు.
ఇదీ చదవండిఃధరణితో 15నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి: యాదాద్రి కలెక్టర్